దేవర హక్కులకు భారీ డిమాండ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దేవర ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుందని అందరూ అంటున్నారు. ఈ సినిమా కథ ఎర్ర సముద్రం నేపథ్యంలో ఉంటుందని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది.
ఏప్రిల్ 5న దేవర ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం, దానికి కొరటాల డైరెక్టర్ కావడంతో దేవరపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఇప్పటినుంచే సినిమా బిజినెస్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
తారక్ మార్కెట్, సినిమా క్రేజ్ ను మైండ్ లో ఉంచుకుని ఒక్కో ఏరియాకు ఒక్కో రేట్ ను ఫిక్స్ చేస్తున్నారట నిర్మాతలు. ఇందులో భాగంగానే నైజాంలో ఏకంగా రూ.50 కోట్లు కావాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.50 కోట్లంటే భారీ రేటే కానీ ఎన్టీఆర్ క్రేజ్, సినిమాకు ఉన్న హైప్ వల్లే నిర్మాతలు అంతమొత్తాన్ని కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ రేటు చెల్లించి దేవర నైజాం హక్కులను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.













