కనీవినీ ఎరుగని రీతిలో విశ్వంభర యాక్షన్ సీన్స్
భోళా శంకర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న చిరంజీవి తన తర్వాతి సినిమా విశ్వంభరను యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే సుమారు 70% షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ సినిమా కావడంతో షూటింగ్ అంతా దాదాపు సెట్స్ లోనే జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. రీసెంట్ గా విశ్వంభరకు సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలైంది. దీని కసోం ప్రత్యేకంగా కొత్త సెట్ వేసి మరీ కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవితో సహా ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటుందట.
రామ్- లక్ష్మణ్ ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. సాహసోపేతంగా ఉండే యాక్షన్ సీన్స్ కోసం చిరూ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీన్స్ టాలీవుడ్ హిస్టరీలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఉంటాయంటున్నారు. ఈ షెడ్యూల్ పూర్తైతే షూటింగ్ దాదాపు పూర్తైనట్లే అంటున్నారు. జులై ఎండింగ్ లోపు షూటింగ్ ను పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కవ సమయం కేటాయించాలనే ప్లాన్ లో డైరెక్టర్ ఉన్నాడు.













