సుశ్మితా సేన్ నటించిన హాట్‌స్టార్ స్పెషల్స్లోని “ఆర్య” ఇప్పుడు తెలుగులో
వీక్షకుల నుంచి అద్భుత ప్రతిస్పందన అందుకున్న అనంతరం హాట్‌స్టార్ స్పెషల్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన సుశ్మితా సేన్ మరియు చంద్రచూడ్ సింగ్ నటించిన ఆర్య దేశంలో మరోసారి సంచలనాన్ని సృష్టించేందుకు సిద్ధమైంది. 9-ఎపిసోడ్ల ఈ మాస్టర్ పీస్ ఆర్యలో-తన భర్తను కోల్పోయిన తరువాత అనివార్యంగా తన పిల్లలను అన్ని సమస్యలు, ఆటంకాల నుంచి రక్షించుకునేందుకు ఆమె మాదక ద్రవ్యాల నెట్వర్కులో చిక్కుకుంటుంది. జూన్ నెలలో విడుడలైనప్పటి నుంచి ఈ డిజిటల్ కార్యక్రమం లాక్డౌన్ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందగా, వీక్షకులు మరియు విమర్శకుల నుంచి సమానమైన ప్రశంసలు అందుకుంది. ప్రజాదరణ, డిమాండ్ మరియు అభిమానుల ప్రతిక్రియలను పరిగణనలోకి తీసుకుని రామ్ మాధ్వాని ఈ సిరీస్‌ను 6 ఇతర ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ షోలో ప్రముఖ సంభాషణలు విజయవంతం అయ్యాయి మరియు మన పాప్ సంస్తృతిలో భాగంగ కాగా, ఇవి ఇప్పుడు మరాఠి, తమిళం, తెలుగు, బెంగాలి, కన్నడ మరియు మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది తమ భాషలోనే వీక్షించే అనుకూలతలను వీక్షకులకు అందిస్తుంది మరియు డబ్ చేసిన ఈ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్ విఐపిలో సెప్టెంబరు 6, 2020 నుంచి అందుబాటులోకి వచ్చింది.
దీని గురించి రామ్ మాధ్వాని మాట్లాడుతూ ‘మేము ఆర్యను తెరకెక్కించినప్పుడే అందులో ఒక ప్రత్యేకతను కలిగి ఉందని గుర్తించాము. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వీక్షకులు దీన్ని తమ సొంత భాషలో వీక్షించేలా చేయడం నిజంగా చాలా సంతోషదాయక అనుభవం. భారత్‌వంటి వైవిధ్యమయ దేశంలో మేము 6 విభిన్న భాషల్లో మన కథను సమర్పించే విశిష్ట అవకాశం మాకు లభించింది. వీక్షకులు ఈ కథతో అలానే ఆర్యకు చెందిన ప్రపంచంలో అత్యంత లోతుగా మమేకం కావడాన్ని సాధ్యం చేస్తుందని మేము విశ్వసిస్తుండగా, దీనికి హిందీలో లభించిన ఆదరణే, ప్రేమే ఇతర భాషల్లోనే దక్కించుకుంటుందని’ ధీమా వ్యక్తం చేశారు.
మాజీ మిస్ యూనివర్స్ మరియు నటి సుశ్మితా సేన్ మరియు 90వ దశకం నటుడు చంద్రచూడ్ సింగ్ ఈ ఆకర్షణీయమైన కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ షోలో ప్రతిభావంతులైన నటులు నమిత్ దాస్, సికందర్ ఖేర్, జయంత్ కృపలాని, సోహైలా కపూర్, సుగంధా గార్గ్, మాయా సరీన్, విశ్వజిత్ ప్రధాన్ మరియు మనీశ్ చౌధరి ప్రముఖ పాత్రల్లో నటించారు. రామ్ మాధ్వాని, సందీప్ మోది కో-క్రియేటర్లు మరియు కో-డైరెక్టర్లుగా వ్యవహరించగా, వినోద్ రావత్ కో-డైరెక్టరుగా బాధ్యతలు నిర్వహించారు. ఆర్య అత్యంత ప్రియమైన సిరీస్. రామ్ మాధ్వాని ఫిల్మ్స్ మరియు ఎండమోల్ షైన్ నిర్మాణంలో తెరకెక్కిన ఆర్య ప్రజాదరణ అందుకున్న డచ్ క్రైమ్ సిరీస్ పెనోజాకు అధికారిక రీమేక్.
రాజస్థాన్‌లో ఉన్నత వర్గానికి చెందిన కుటుంబంలో జన్మించిన ఆర్య (సుశ్మితా సేన్), తేజ్ (చంద్రచూడ్ సింగ్)కు ముద్దుల భార్య, ఆజ్ఞానువర్తి కుమార్తె, ప్రియమైన సోదరి మరియు ముగ్గురు అందమైన బిడ్డలకు తతల్లి. వారి కుటుంబం మూడు అత్యంత పెద్ద ఔషధ కంపెనీల యాజమాన్యాన్ని కలిగి ఉంటుంది. అవి తేజ్ నడిపిస్తున్న మాదక ద్రవ్యాల నెట్వర్కుకు ఆ కంపెనీలు అడ్డుగా ఉంటాయి. ఆమె తన భర్త కుటుంబపు వ్యాపారంలో లోతుగా ఇరుక్కున్నట్లు గుర్తిస్తుంది మరియు అతనికి వ్యాపారాన్ని లేదా ఆమెను అలాగే పిల్లలను విడిచి పెట్టాలని సూచిస్తుంది. అంతలోనే తేజ్‌పై నిగూఢమైన దాడి జరుగుతుంది. ఆమె ప్రాణాలకు హాని కలిగే పరిస్థితులు నెలకొంటాయి మరియు ఇది ఆర్య జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఆమె తన కుటుంబాన్ని ప్రత్యర్థుల నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. తన కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను తెలుసుకుంటుంది. ఈ ప్రయాణంలో ఆమె త్యజించి, దూరం కావాలని కోరుకునే ప్రపంచంలోనే లోతుగా మునిగిపోతుంది.
సెప్టెంబరు 6 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారానికి అందుబాటులోకి వస్తుండగా, మరాఠి, తమిళం, తెలుగు, బెంగాలి, కన్నడం, మలయాళం భాషల్లో హాట్‌స్టార్ స్పెషల్స్‌ను డిస్నీ+హాట్‌స్టార్ విఐపిలో మాత్రమే వీక్షించండి.













