సినిమా హిట్ అయినా అవకాశాలు రావట్లేదు..
ఓ పెద్ద హీరోతో నటించిన సినిమాకు మంచి సక్సెస్ దక్కితే అందులో నటించిన హీరోయిన్‌కు ఛాన్స్ ల మీద ఛాన్స్ లు రావడం సహజం. కానీ హనీ రోజ్ కు మాత్రం అసలు అవకాశాలే రావడం లేదు. వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ లో హనీ రోజ్ పాత్ర కూడా ఉంది. ఈ సినిమాతో హనీ రోజ్ కు మంచి మార్కులే పడ్డాయి. శృతి హాసన్ ఉన్నప్పటికీ చాలా మంది హనీకే ఫ్యానిజం చేశారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే కాకుండా, వీర సింహారెడ్డి ప్రమోషన్స్ లో కూడా హనీ బాగానే పార్టిసిపేట్ చేసింది. హనీ రోజ్ ఎక్కడ ఉందో అక్కడ జనాలు ఆమెను చూడ్డానికి ఎగబడ్డారు. దీంతో ఈమె క్రేజ్ చూసి వీరసింహారెడ్డి హిట్ అయితే హనీ వరుస అవకాశాలతో బిజీగా మారడం ఖాయమనుకున్నారంతా. ఆ సినిమా హిట్టయినా సరే ఇప్పటికీ హనీ రోజ్ కు తెలుగులో మరో ఛాన్స్ వచ్చింది లేదు.
దీనికి హనీ ఏజ్ కారణం అని తెలుస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆమెకు కెరీర్ మొదట్లో అవకాశాలు రాలేదు. బాలయ్య సినిమాలో నటించిన దగ్గరనుంచే హనీ రోజ్‌కు మంచి పేరు, క్రేజ్ వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి. యంగ్ హీరోల పక్కన హనీ రోజ్ సరిపోకపోయినా, సీనియర్ హీరోలకు ఎలాగూ హీరోయిన్ల కొరత ఉంది కాబట్టి ఈమెను వారికి జోడీగా కన్సిడర్ చేయొచ్చు. చూడాలి మరి హనీ రోజ్‌కు ఎప్పుడు సెకండ్ ఛాన్స్ వస్తుందో.













