Ramayan: రామాయణ్‌కు హాలీవుడ్ స్టంట్ మాస్టర్

రామాయణం కథతో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) తీసిన ఆదిపురుష్(Adhipurush) ఎంత పెద్ద ఫ్లాప్ అనేది తెలిసిందే. ఆ సినిమాతో విసిగిపోయిన ఆడియన్స్ రామయణ కథను ఏ డైరెక్టర్ గొప్పగా తీస్తాడా అని ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు తగ్గట్టుగానే నితీష్ తివారీ(Nithish Tiwari) రామాయణం(Ramayanam) సినిమాను అనౌన్స్ చేశాడు. రామాయణంను రెండు భాగాలుగా తీసి ఆడియన్స్ కు ఆ కథ గొప్పదనాన్ని తెలియచేయాలని డిసైడ్ అయ్యాడు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) ఈ సినిమాలో రాముడిగా కనిపించనుండగా, సాయి పల్లవి(Sai Pallavi) సీతగా కనిపించనుంది. రావణుడి పాత్రలో కన్నడ హీరో యష్(Yash) నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యష్ ఈ సినిమాలో కేవలం నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
రామాయణం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ కు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ గయ్ నోరిస్(Guy Noris) దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో మ్యాడ్ మ్యాక్స్(Mad Max) లాంటి సినిమాలకు వర్క్ చేశారు. యష్ తో పాటూ గయ్ నోరిస్ ఉన్న ఫోటో రామాయణం సెట్స్ నుంచి లీక్ అవగా ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఈ సినిమాకు పని చేస్తుండటంతో రామాయణంలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయోననే ఆసక్తి అందరిలోనూ పెరుగుతుంది.