ఎన్టీఆర్ సరసన ఎమ్మా రాబర్ట్స్ !
ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్కి జోడీగా ఎంపిక చేసిన బ్రిటన్ కథానాయిక డైసీ ఎడ్గార్ బోన్స్ అనుకోని కారణాల వల్ల తప్పుకున్న విషయం విదితమే. ఆమె స్థానంలో బాలీవుడ్ నుంచి శ్రద్ధా కపూర్, జాక్వెలిస్ ఫెర్నాండేజ్, పరిణీతి చోప్రా వంటి పలు రకాల పేర్లు వినిపించినప్పటికీ తాజాగా హాలీవుడ్ పాపులర్ హీరోయిన్ ఎమ్మా రాబర్ట్స్ని ఫైనల్ చేసే పనిలో చిత్ర బృందం ఉందట. ఇప్పటికే ఆమెతో కథా చర్చల్ని జరిపారని, అన్నీ కుదిరితే త్వరలోనే ఫైనల్ చేస్తారని సమచారం. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చరణ్ సరసన అలియాభట్, కథానాయికగా నటిస్తుంది. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఎమ్మా రాబర్ట్స్ హాలీవుడ్లో లైమ్లైఫ్, స్క్రీమ్ 4, ఆడల్ట్ వరల్డ్, వియ్ ఆర్ ది మిల్లర్, వాలెంటైన్స్ డే వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ది హంట్, హాలిడేట్ లో నటిస్తున్నారు.













