Hit3: హిట్3 ఇంట్రో సీన్ లీక్.. అసలు మ్యాటర్ ఇది
వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని(Nani) ప్రస్తుతం శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో హిట్3(hit3) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గా సక్సెస్ అందుకుంటున్న నాని నటిస్తున్న హిట్3 నుంచి ఇంట్రో సీన్ లీకైందని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం లీకైన ఫోటోలు, వీడియోలు హిట్3కు సంబంధించినవి కావని అంటున్నారు.
రీసెంట్ గా నాని ఓ కమర్షియల్ యాడ్ కోసం నటించాడని, లీకైన విజువల్స్ దానికి సంబంధించినవే అని తెలుస్తోంది. నాని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి చేసిన యాడ్ కు సంబంధించిన వీడియోనే లీకైందని, నాని నటిస్తున్న ఏ సినిమాకూ సంబంధించినవి కావని చెప్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గానే హిట్3 డైరెక్టర్ శైలేష్ లీకులపై మాట్లాడిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే హిట్3 సినిమా మే 1న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనిధి శెట్టి(Sreenidhi Shetty) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టారు. త్వరలోనే ఆ ప్రమోషన్స్ ను మరింత స్పీడప్ చేయనున్నారు. హిట్3 ను నాని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.













