Kubera: కుబేరకు మరో హిట్ సెంటిమెంట్
ధనుష్(Dhanush) హీరోగా శేఖర్ కమ్ముల(Shekar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కుబేర(Kubera). ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజైన కంటెంట్ ప్రతీదీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలానే ఉంది. నాగార్జున(Nagarjuna) కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది.
ఫిబ్రవరిలో కుబేర ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనుంది. అందులో భాగంగా కుబేర నుంచి మొదటిగా హీరో ఇంట్రో సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి పాటను ధనుష్ తో పాడించడం వల్ల అంచనాలు బాగా పెరుగుతున్నాయి.
ధనుష్ గతంలో ఇప్పటికే పలుమార్లు తన సినిమాల్లో పాటలు పాడిన సందర్భాలున్నాయి. వాటిల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడదే సెంటిమెంట్ కుబేరకు కూడా వర్కవుట్ అవుతుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. కుబేర సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లోనూ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.













