హిట్-3 ఎప్పుడు మొదలవుతుదంటే..?
తెలుగులో ఎంతో సక్సెస్ అయిన ఫ్రాంచైజ్ సినిమాల్లో హిట్ కూడా ఒకటి. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్సేన్ హీరోగా వచ్చిన హిట్-1 మంచి సక్సెస్ అయింది. ఆ తర్వాత హిట్-2లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఆ సినిమా హిట్-1ను మించి విజయం అందుకుంది. ఆ సినిమా క్లైమాక్స్ లో హిట్-3 ఉంటుందని హింట్ ఇచ్చిన డైరెక్టర్ అందులో హీరో నాని అని కూడా రివీల్ చేశాడు.
హిట్-2 సినిమా వచ్చి సంవత్సరం దాటినా ఇంకా హిట్-3 గురించి ఎలాంటి అప్డేటూ లేదు. హిట్-2 తర్వాత సైంధవ్‌తో శైలేష్ బిజీ అయితే నాని వేరే ప్రాజెక్ట్ లతో బిజీ అయ్యాడు. దీంతో హిట్-3కు టైమ్ దొరకలేదు. రీసెంట్ గా సైంధవ్ ప్రమోషన్స్ లో భాగంగా హిట్-3 గురించి శైలేష్ క్లారిటీ ఇచ్చాడు. మరో ఏడాదిన్నర తర్వాత హిట్-3 స్టార్ట్ కానున్నట్లు శైలేష్ వెల్లడించాడు.
హిట్-3కు సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదని, నాని ఫ్రీ అవడానికి కూడా టైమ్ పడుతుందని శైలేష్ తెలిపాడు. ఇక తన సినిమా ఏంటనేది సైంధవ్ ఫలితాన్ని బట్టి ఉంటుందని కూడా ఆయన వివరించాడు. సైంధవ్ హిట్ అయితే చంద్రప్రస్థ వరల్డ్ ను కంటిన్యూ చేస్తూ మరో సినిమా చేస్తానని చెప్పాడు శైలేష్.













