హాయ్ నాన్న డైరెక్టర్ నెక్ట్స్ ఏంటి?
హాయ్ నాన్న ద్వారా మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు డైరెక్టర్ శౌర్యువ్. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ ను ఎంతో బాగా పండించి మంచి మార్కులు కొట్టేశాడు. డైరెక్టర్ గా శౌర్యువ్ తనదైన శైలిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఏ డైరెక్టర్ కైనా ఒక హిట్ వస్తే వెంటనే నిర్మాతల నుంచి అడ్వాన్స్ లు వస్తుంటాయి.
కొత్త, పాత అనే సంబంధం లేకుండా హీరోలు కూడా ఆ డైరెక్టర్ తో సినిమా చేయాలనుకుంటారు. కానీ హాయ్ నాన్న తో హిట్ అందుకున్న శౌర్యువ్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉన్నాడు. తనకు అడ్వాన్సులు ఇచ్చే నిర్మాతలున్నప్పటికీ తాను మాత్రం తీసుకోవడానికి రెడీగా లేడగట. అడ్వాన్సులు రిజెక్ట్ చేయడానికి కూడా శౌర్యువ్ రీజన్ చెప్తున్నాడు.
తర్వాతి సినిమా ఓకే చేయకపోవడానికి తన దగ్గర ఇప్పుడు కథ లేదని, ఆ కథ తనకు, తన మనసుకు నచ్చినప్పుడే వేరే సినిమాపై దృష్టి పెట్టగలను. తను ఒక కథ ను ఫిక్స్ అయినప్పుడు మాత్రమే అడ్వాన్స్ తీసుకుని సినిమా చేస్తానని చెప్పాడు శౌర్యువ్. బడ్జెట్ సినిమా కథపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఎంతవరకు ఖర్చు పెట్టాలనేది స్టోరీపైనే ఆధారపడి ఉంటుందని చెప్పాడు. అంతేకాదు తన దగ్గర చిన్న చిన్న కథలు చాలా ఉన్నాయని తర్వాతి సినిమాను మీడియం బడ్జెట్ తో తీయాలనుకుంటున్నట్లు శౌర్యువ్ వెల్లడించాడు.













