నేచురల్ స్టార్ ని ఫాలో అవుతున్న నితిన్..!
సినిమా కథ పై, తన బాడీ లాంగ్వేజ్ కి సరైన కథను ఎంచుకోవడంలో నేచురల్ స్టార్ నానికి మంచి ఐడియా ఉంది. సినిమా హిట్టా, ఫట్టా అన్నది పక్కన పెడితే టైమ్ వేస్ట్ చేయకుండా.. సినిమాలను వరుసగా ప్లాన్ చేసుకోవడంలో నాని ముందు నుంచి మంచి ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ యేడాది నాని నుంచి టక్ జగదీశ్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికీ అనే మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇప్పుడు హీరో నితిన్ కూడా అదే రూట్ లో వెళ్తున్నట్లు కనిపిస్తుంది. భీష్మ హిట్ తో మంచి ఊపు మీదున్న నితిన్ ఈ యేడాది మూడు సినిమాలను థియేటర్లలో దింపడానికి రెడీ అవుతున్నాడు. ఈ శుక్రవారం తన తాజా చిత్రం చెక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తర్వాత మరో నెలకు రంగ్ దే ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటించిన ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కానుంది. ఇక పోతే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ అంధదూన్ తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నభా నటేష్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా జూన్ 11న విడుదల చేయనున్నారు. అంటే 2021 ఫస్టాఫ్ లోనే నితిన్ నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయన్నమాట. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.













