బాలీవుడ్ తారలంతా అక్కడ మెరిశారు
బాలీవుడ్ తారలంతా అక్కడ మెరిశారు. ఆహూతులను మెప్పించారు. విభిన్నమైన దుస్తులు ధరించి రెడ్ కార్పెట్‌పై హోయలొలికించారు. హలో హాలో ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ 2019 వేడుకలో స్టార్స్ అంతా పాల్గొని సందడి చేశారు. అందులో రణవీర్‌సింగ్, కత్రినా కైఫ్, జాన్వి కపూర్, విక్కీ కౌసల్, అయుస్మాన్ ఖుర్రాన్ వంటి తారలంతా హాజరయ్యారు. రణవీర్ సింగ్‌కు సూపర్‌స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, విక్కీ కౌసల్కు ఔట్‌స్టాండింగ్ టాలెంట్ అవార్డు వరించింది. జావేద్ అక్తర్, షబానా అజ్మీలకు టైమ్‌లెస్ ఐకాన్ ఇన్ ఇండియా సినిమా అవార్డుతో సన్మానించారు. ఈ దంపతుల కుమారుడు ప్రముఖ సింగర్ ఫార్హ అక్తర్ మోస్ట్ స్టయిలిష్మ్యాన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకున్నారు. డిబ్యూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు జాన్వి కపూర్‌కు ఇచ్చారు.













