Ananya Pandey: చిన్నతనంలోనే ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నా
నెపో కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్యా పాండే(Ananya Pandey) ఆ తర్వాత తక్కువ కాలంలోనే తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా కేసరి చాప్టర్2(kesari chapter2)తో ప్రేక్షకుల్ని పలకరించిన అనన్య తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ సినిమాతో 2025కు గుడ్ బై చెప్పనుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్యా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
కెరీర్ స్టార్టింగ్ లో సక్సెస్, ఫెయిల్యూర్ల గురించి తనకు పెద్దగా తెలియదని, పోస్టర్లలో స్పెషల్ గా, ఎట్రాక్టివ్ గా కనిపిస్తే చాలనుకునేదాన్నని చెప్పిన అనన్యా ఇప్పుడు తన దృష్టంతా మంచి నటిగా ప్రూవ్ చేసుకోవాలనే దానిపైనే ఉందని చెప్పింది. నటిగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ కొత్త ప్రాజెక్టులతో తనను తాను ఛాలెంజ్ చేసుకోవాలనేదే తన కోరికగా అనన్యా చెప్పుకొచ్చింది.
సినీ ఇండస్ట్రీలోకి రాకముందు చిన్న తనం నుంచే తానెన్నో విమర్శల్ని ఎదుర్కొన్నానని, తన పని కాకుండా వ్యక్తిత్వం గురించి వచ్చే విమర్శలే తనను ఎక్కువ ప్రభావితం చేశాయని, తర్వాత్తర్వాత ఎదగడమంటే మారడమని గ్రహించానని, చిన్నప్పుడు సోషల్ మీడియాలో తక్కువ లైక్స్ వచ్చినా కూడా బాధగా అనిపించేదని, కానీ తన పేరెంట్స్ సోషల్ మీడియా వాడకంలో కఠినంగా ఉండటం వల్లే తన బాల్యం సాఫీగా సాగినట్టు అనన్య తెలిపింది.






