వామ్మో బన్నీ రెమ్యూనరేషన్ అంతా!
ఒకప్పుడు హీరో కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడంటే అదెంతో గొప్పగా చెప్పుకునేవాళ్లు. కానీ ఇప్పుడా కోటి రూపాయల్ మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టే తీసుకుంటున్నాడు. ఇక అసలు విషయానికొస్తే, పుష్ప2 సినిమాకు గాను అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా రెవిన్యూలో పర్సెంటేజ్ను తీసుకునేలా డీల్ కుదుర్చుకున్నాడట.
ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు కానీ ఈ విషయమై అల్లు కాంపౌండ్ లో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. పుష్ప2 సినిమాకు జరిగే బిజినెస్ లో 33% అల్లు అర్జున్ కు ఇచ్చేలా ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకున్నారని ఇన్ సైడ్ టాక్. ఒకవేళ పుష్ప2 సినిమాకు రూ.1000 కోట్లు బిజినెస్ జరిగితే అందులో కేవలం బన్నీకే రూ.333 కోట్లు రానున్నాయన్నమాట.
ప్రస్తుతం సౌత్ లో రజినీకాంత్ అందరికంటే ఎక్కువగా రూ.210 కోట్లు ఛార్జ్ చేస్తున్నారనే వార్త గత నెలలో వైరల్ అయింది. ఇప్పుడు బన్నీ ఏకంగా సూపర్ స్టార్ రజినీని దాటి ఒక్క సినిమాకు ఏకంగా రూ.333 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. ఇంతకంటే ఓ హీరోకి దక్కాల్సిన ఘనత ఇంకేముంటుందని కొంతమంది అంటుంటే, ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకోవడం ఒక్క బన్నీకే చెల్లిందని మరికొందరు ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.













