సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇవ్వకపోవడానికి కారణం అదే: హరీష్ శంకర్
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ, ఫాన్స్ కి అందుబాటులో ఉండే డైరెక్టర్ హరీష్ శంకర్. తన ఆటిట్యూడ్ తో కూడా ఈ డైరెక్టర్ చాలా పాపులర్ అయ్యాడు. స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని హరీష్ శంకర్. అభిమాన హీరోతో తాను తీయబోయే రెండవ సినిమా గురించి ఇదివరకు ఈ డైరెక్టర్ సోషల్ మీడియాలో బాగానే అప్డేట్స్ ఇస్తూండేవాడు. కానీ, ఈ మధ్య ఎందుకో తన అప్ కమింగ్ మూవీ పై ఈ దర్శకుడు పెద్దగా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండట్లేదు.
రీసెంట్ గా ప్రముఖ ఛానెల్ చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఒకడిని కావడం వల్ల తన ఎగ్జైట్మెంట్ను మిగిలిన ఫ్యాన్స్‌తో పంచుకునేవాడినని, పవన్‌ను కలిసినా, ఒక మంచి డైలాగ్ రాసినా, పవన్ కి సంభందించిన ఏ అప్డేట్ ఉన్నా సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకునేవాడినని హరీష్ అన్నారు. కానీ, ఈ మధ్య కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల తాను హర్టయినట్లుగా హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు.
పవన్, హరీష్ కాంబినేషన్ లో వచ్చే అప్ కమింగ్ మూవీ ” ఉస్తాద్ భగత్ సింగ్ ” అని అందరికి తెలిసిన విషయమే. అయితే ఇది రీమేక్ సినిమా, ఈ సినిమా తీయొద్దు అని పవన్ అభిమానులు ట్విట్టర్ ద్వారా డైరెక్టర్ తో పెద్ద యుద్ధమే చేసారు. అసలు ఇది రీమేక్ సినిమానేనా? కాదా? ఒకవేళ ఇది రీమేక్ సినిమా అయితే ఈ సినిమాని ఏ విధంగా చిత్రీకరించాం అనే విషయాలు తాను ఇప్పుడు చెప్పను అని, అన్నిటికి సినిమా రిలీజ్ అయ్యాకే సమాధానం దొరుకుతుందని హరీష్ శంకర్ గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు.













