HariHara Veeramallu: వీరమల్లు రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నిధి అగర్వాల్(Niddhi Agarwal) హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu). ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ఇంకా చెప్పాలంటే కరోనా కంటే ముందే ఈ సినిమా స్టార్ట్ అయింది కానీ వివిధ కారణాల వల్ల సినిమా షూటింగ్ లేటవడం, తర్వాత పవన్ ఈ సినిమాను లైట్ తీసుకుని మిగిలిన సినిమాలపై ఫోకస్ చేయడంతో ఇప్పటికీ వీరమల్లు రిలీజ్ కాకుండానే మిగిలింది.
ఆ తర్వాత పవన్ ఎలక్షన్స్ లో బిజీ అవడం, ఎలక్షన్స్ లో పవన్ గెలిచి డిప్యూటీ సీఎం అవడం, ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అవడం వల్ల ఈ సినిమాను పూర్తి చేద్దామన్నా వెంటనే వీలు పడలేదు. మొత్తానికి చాలా ఏళ్లకు రీసెంట్ గానే ఈ సినిమా పూర్తైంది. షూటింగ్ పూర్తైంది కదా ఇప్పుడైనా వీరమల్లు త్వరగా రిలీజవుతుందనుకుంటే మేకర్స్ దాని గురించి అప్డేటే ఇవ్వడం లేదు.
ఎప్పుడో రిలీజవాల్సిన సినిమా ఇన్ని సార్లు వాయిదాల మీద వాయిదాలు పడటం పవన్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ఇలాంటి టైమ్ లో వీరమల్లు రిలీజ్ డేట్ గురించి నెట్టింట ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.






