ప్రభాస్ డైరెక్టర్ల లిస్ట్‌లోకి మరో పేరు
రాజమౌళితో తీసిన బాహుబలికే కాకుండా తన తర్వాతి సినిమాలైన సాహో, రాధేశ్యామ్ సినిమాలకు కూడా ప్రభాస్ చాలా భారీగానే టైమ్ కేటాయించాడు. కానీ బాహుబలికి దక్కిన ప్రశంస, పేరూ మిగిలిన రెండు సినిమాలకు రాలేదు. దీంతో ప్రభాస్ ఆ రెండు సినిమాల కోసం చాలా టైమ్ వేస్ట్ చేశాడనే భావన అందరికీ కలిగింది. ఆ టైమ్ ను సేవ్ చేసుకోవడానికి తర్వాత ప్రభాస్ బాగా స్పీడు పెంచేశాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా.. ఇలా వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టి వాటిని పూర్తి చేసే పనిలో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. అంతే కాదు ఫ్యూచర్ లో కూడా ప్రభాస్ సినిమాల గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి.
సందీప్ రెడ్డి వంగతో ఓ సినిమా, సిద్దార్థ్ ఆనంద్‌తో ఓ సినిమా, ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా ఇలా చాలానే వార్తలొస్తున్నాయి. వీరితో పాటుగా రీసెంట్గా మరో డైరెక్టర్ కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అయ్యాడు. అతనే హను రాఘవపూడి. ప్రభాస్ తో ఈ డైరెక్టర్ ఓ లవ్ స్టోరీని తెరకెక్కించబోతున్నాడని ఇండస్ట్రీలో బాగా ప్రచారం అవుతోంది.
సీతారామం సినిమాతో హను విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇలాంటి సినిమా తీసిన డైరెక్టర్ తో ఎవరైనా సినిమా చేయాలనుకుంటారు. అందులో సందేహం లేదు. ప్రభాస్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. హను చెప్పిన పాయింట్ నచ్చి అతనికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, చాన్నాళ్లుగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో కూడిన లవ్ స్టోరీ చేయాలనుకుంటున్న ప్రభాస్ కు ఇదే కరెక్ట్ స్టోరీ అనిపించి, హనూ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.
ఇదిలా ఉంటే ఈ సినిమాను కూడా తనకు సీతారామం లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన బ్యానర్ వైజయంతీ మూవీస్ లోనే హను చేయాలనుకుంటున్నాడట. ప్రభాస్ కూడా ప్రస్తుతం తన ప్రాజెక్ట్ కె ఈ బ్యానర్లోనే చేస్తున్నాడు కాబట్టి, తన వైపు నుంచి కూడా ఓకే. ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ అయ్యాక ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.













