ప్రభాస్ కోసం రూట్ మార్చనున్న హను
కల్కి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ డైరెక్టర్ మాత్రం ఈ విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా ఫలానా జానర్ అని, హీరోయిన్ ఫిక్స్ అయిందని, ప్రభాస్ పాత్ర ఇలా ఉంటుందంటూ నెట్టింట రోజుకో వార్త వినిపిస్తూ ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. క్లాస్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి, ప్రభాస్ తో కూడా క్లాస్ సినిమానే చేస్తారని అంతా అనుకున్నారు. కానీ హను ఈసారి ప్రభాస్ కోసం రూట్ మారుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తో హను క్లాస్ టచ్ ఇస్తూనే మాస్ సినిమాను తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
పీరియాడిక్ హిస్టారికల్ ఫిక్షన్ మూవీగా రూపొందనున్న ఈ సినిమా యుద్ధ నేపథ్యంలో హను మార్క్ లవ్ స్టోరీని జోడించి కథను రెడీ చేశాడంటున్నారు. లవ్ స్టోరీ అయినప్పటికీ ఇందులో ఫ్యాన్స్ కోరుకునే మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ కు కొదువ ఉండదంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్స్ లో కనిపిస్తాడని కూడా అంటున్నారు. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే మూడు సాంగ్స్ కంపోజింగ్ కూడా అయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఆగస్ట్ నెలాఖరున లేదా సెప్టెంబర్ మొదట్లో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సుంది.













