Fouji: ఊహకందని స్థాయిలో ఫౌజీ ప్రపంచం
హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా ఫౌజీ(Fouji). ఈ సినిమాకు టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. మంచి టైమ్ చూసి అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కథ బాగా నచ్చడంతో ప్రభాస్ ఫౌజీ కోసం అడిగినప్పుడు డేట్స్ ఇస్తూ వస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా ఫౌజీ గురించి ప్రస్తుతం కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట ప్రచారం అవుతున్నాయి. ఫౌజీ ప్రపంచం ఎవరూ ఊహకు అందని రీతిలో ఉండబనుందని, స్వాతంత్య్రం రాకముందు జరిగే నేపథ్యంలో ప్రభాస్ ఓ బ్రాహ్మణ కులం నుంచి వచ్చిన సైనికుడిగా ఈ సినిమాలో కనిపిస్తాడని అంటున్నారు.
ప్రభాస్, ఇమాన్వీ(Imanvi) మధ్య జరిగే లవ్ స్టోరీ చాలా ఫ్రెష్ గా ఇప్పటివరకు ఏ స్టార్ హీరో సినిమాలో చూడని రీతిలో ఉంటుందని, స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా ఉంటూనే ఆడియన్స్ కు గూస్బంప్స్ అనిపించే యాక్షన్ సీన్స్ ఉంటాయని, మరీ ముఖ్యంగా బ్రిటిషర్లతో వచ్చే యుద్ధం సన్నివేశం చూడ్డానికి రెండు కళ్లు సరిపోవనే రీతిలో ఉంటుందని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాలో ఫ్రీడమ్ ఫైటర్లు చాలా మంది కనిపించనున్నారని సమాచారం.













