ఊర మాస్ సీన్స్ ను తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్
ఎన్నో బ్రేకులు, మార్పుల మధ్య ఎట్టకేలకు మళ్లీ సెట్స్ పైకి వెళ్లిన గుంటూరు కారం షూటింగ్ శరవేగంగా బ్రేక్స్ లేకుండా జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్లోనే జరుగుతుంది. ఈ షెడ్యూల్లో కీలక తారాగణంతో పాటూ హీరో మహేష్ బాబు కూడా పాల్గొంటున్నాడు. రీసెంట్గా శ్రీలీల కిడ్నాప్ సీన్స్ ను తెరకెక్కించినట్లు సమాచారం. విలన్స్ శ్రీలీలను తీసుకెళ్లాక, మహేష్ వచ్చి ఆమెను కాపాడే ట్రాక్ ఓ రేంజ్ లో వచ్చిందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ను ఊర మాస్ గా తెరకెక్కించాడట త్రివిక్రమ్. గుంటూరు కారం సినిమాపై మహేష్ ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలను దృష్టి లో పెట్టుకుని త్రివిక్రమ్ ప్రతీ సీన్ ను ఎంతో పర్ఫెక్ట్ గా తీర్చి దిద్దుతున్నాడని తెలుస్తోంది.
గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలుండటంతో ఈ సినిమాను ఎలాగైనా బ్లాక్ బస్టర్ చేయాల్సిన బాధ్యత త్రివిక్రమ్ పై ఉంది. అలవైకుంఠపురములో సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ ని తీసుకున్న త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో ఎలాంటి పొరపాటుకు ఛాన్స్ లేకుండా ముందుకెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే థమన్ రెడీ చేసిన రెండు ట్యూన్స్ కు మహేష్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని టాక్. త్వరలోనే గుంటూరు కారం ఫస్ట్ లిరికల్ రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలతో సహా మహేష్ కూడా చెప్పాడు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. ఇది పాన్ ఇండియా సినిమా కాదు కాబట్టి ఎలాగూ ప్రమోషన్స్ కు ఇబ్బందేమీ ఉండదు. ఏదేమైనా ఇప్పటి నుంచి బ్రేక్స్ లేకుండా సినిమా షూటింగ్ జరిగితేనే గుంటూరు కారం సంక్రాంతి టార్గెట్ ను అందుకోగలదు. మరి దీనికి గురూజీ ఎలాంటి ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడో చూడాలి.













