జాన్వీకి మంచి టైమ్ స్టార్ట్ అయినట్లే!
శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చాలా కాలమైనప్పటికీ ఇప్పటివరకు అమ్మడుకు సరైన హిట్ పడలేదు. కానీ ఎప్పుడైతే జాన్వీ దేవర సినిమా ఒప్పుకుందో ఆ తర్వాత నుంచి అమ్మడికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. జూ.ఎన్టీఆర్ సరసన ఎవరైతే బాగుంటారని చాలా కాలం వెతికాక జాన్వీని ఫిక్స్ చేశాడు కొరటాల శివ.
ఇప్పుడు దేవర తో పాటూ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో కూడా జాన్వీనే ఎంపిక చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటూ హిందీలో మూడు భాగాలుగా రానున్న రామాయణం లోనూ జాన్వీకి కీలక పాత్ర ఆఫర్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలో సీత క్యారెక్టర్ జాన్వీకి ఆఫర్ చేశారంటున్నారు కానీ దాని కోసం ఇప్పటికే సాయి పల్లవిని సంప్రదించారు. మరి సాయి పల్లవి ఆ పాత్రకు ఎస్ చెప్పిందా నో అనిందా అనేది తెలియదు.
ఒకవేళ సీతగా నటించడానికి సాయి పల్లవి ఓకే చెప్తే డైరెక్టర్ నితీష్ తివారి, జాన్వీకి ఏ పాత్రను ఆఫర్ చేశాడో తెలియాల్సి ఉంది. ఇవన్నీ చూస్తుంటే జాన్వీ కపూర్ కు మంచి టైమ్ స్టార్ట్ అయినట్లే అనిపిస్తుంది. దేవర రెండు పార్టులుగా రానుంది కాబట్టి టాలీవుడ్ లో క్రేజ్ మరింత పెరుగుతుంది. చరణ్ సినిమా ఛాన్స్ కూడా కొట్టేస్తే అమ్మడుకు బంపరాఫర్ దక్కినట్టే.













