Prabhas: ప్రభాస్ ఆ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) పెళ్లి వార్త వినాలని ఎదురుచూస్తున్న కొద్దీ అది ఆలస్యమవుతూనే ఉంది. కృష్ణం రాజు(Krishnam Raju) ఉన్నప్పుడే పెళ్లి చేయాలని చూశారు కానీ ప్రభాస్ కు నచ్చిన అమ్మాయి దొరక్క అది వాయిదా పడుతూ వస్తుంది. ఈ లోపు ఆయన చనిపోవడం, తన సినిమాలతో ప్రభాస్ బిజీ అవడం జరిగిపోయాయి.
అయితే త్వరలోనే డార్లింగ్ ఓ ఇంటివాడు అవడం ఖాయమనే మాట చాలా బలంగా వినిపిస్తోంది. అన్స్టాపబుల్4(Unstoppable)లో చరణ్(Charan), ప్రభాస్ మధ్య జరిగిన సంభాషణ ద్వారా ఈ గుడ్ న్యూస్ బయటికి వచ్చేసిందని టాక్. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంకు చెందిన అమ్మాయితో ప్రభాస్ పెళ్లి కుదిరిందని, త్వరలోనే ఈ గుడ్ న్యూస్ డార్లింగ్ అందరితో పంచుకోనున్నాడని చెప్పాడట.
ఆ షో కు వెళ్లిన ఆడియన్స్ ద్వారా ఈ లీక్ బయటకు వచ్చింది. ఇందులో ఎంతవరకు నిజముందో జనవరి 14న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో బయటపడనుంది. బాలయ్య, చరణ్ మధ్య జరిగిన కాన్వోని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. నిజంగా ప్రభాస్ పెళ్లి కనుక ఫిక్స్ అయి ఉంటే అది ఈ ఏడాదే జరిగే అవకాశముంది.













