Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్
పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు(Harihara veeramallu). ఈ సినిమా గత ఐదేళ్లుగానే నిర్మాణంలోనే ఉండటంతో సినిమాపై ఆడియన్స్ కు, ఫ్యాన్స్ కు ఆసక్తి తగ్గిపోతుంది. ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ ఇంకా షూటింగే పూర్తి కాలేదు. దీంతో షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది, రిలీజ్ ఎప్పుడవుతుందనే విషయాలను ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ఈ సినిమాలో పవన్(pawan) పోర్షన్ కు సంబంధించిన మరో నాలుగైదు రోజుల షూటింగ్ పెండింగ్ ఉండటంతో సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే పవన్ ఇవాళ నుంచి వీరమల్లు షూటింగ్ లో పాల్గొననున్నాడని సమాచారం. ఇవాళ నుంచి వారం రోజుల పాటూ తన డేట్స్ ను అడ్జస్ట్ చేసి షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్నాడట పవన్.
ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను పూర్తి చేసి, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. షూటింగ్ పూర్తవలేదు కాబట్టి మే 9న వీరమల్లు వచ్చే ఛాన్స్ లేదని అర్థమైపోయింది. షూటింగ్ పూర్తయ్యాక మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.






