కార్తీ సినిమా గట్టెక్కినట్టేనా?
ఎన్టీఆర్(NTR) దేవర(Devara) సినిమాకు పోటీ అని తెలిసినప్పటికీ తమిళంలో పోటీ లేకపోవడంతో దేవరకు ఒక రోజు తర్వాత కార్తీ(Karthi) సత్యం సుందరం(Satyam Sundaram) పేరుతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తమిళంలో మంచి హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా తెలుగులో కూడా మంచి వసూళ్లతో గట్టెక్కే దిశగా వెళ్లడం పట్ల టీమ్ ఎంతో సంతోషంగా ఉంది.
వాస్తవానికి ఈ సినిమా పోటీ లేకుండా సోలోగా రిలీజై ఉంటే ఇంకాస్త మంచి ఫలితం దక్కేదనే మాటలో నిజం లేకపోలేదు. ముందు కాస్త నెమ్మదిగా మొదలైన ఈ సినిమా తర్వాత మెల్లిమెల్లిగా ఊపందుకుంది. సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి(Aravind Swamy)ల కాంబినేషన్ లో ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఈ విషయాన్ని గుర్తించిన కార్తీ సినిమాను ఇంకాస్త ప్రమోట్ చేయడానికి వెంటనే విజయవాడ వచ్చే అక్కడి నుంచి పబ్లిసిటీ మొదలుపెట్టాడు.
దేవర లాంటి సినిమాను చూడమని చెప్పకపోయినా చూస్తారు కానీ ఇలాంటి సినిమాలను చూడరు. అందుకే ఈ విషయంలో కార్తీ ముందడుగేసి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. గాంధీ జయంతితో మొదలైన దసరా సెలవులు మరో పది రోజుల పాటూ ఉండటంతో ఈ హాలీడేస్ సినిమా కలెక్షన్స్ కు కీలకం కానున్నాయి. అయితే ఈ సినిమాను ముందు ఓటీటీలో రిలీజ్ చేద్దామనుకున్నారట. నిర్ణయం మార్చుకోవడం వల్ల ఇప్పుడు మంచి రిజల్టే చూస్తున్నామని కార్తీ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.













