గాడ్ ఫాదర్ ఇంట్రెస్టింగ్ అంశాలు
చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్‌ఫాదర్ దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళ బ్లాక్‌బస్టర్ లూసిఫర్‌కు అధికారిక రీమేక్ అనే విషయం తెలిసిందే.
సాధారణంగా రీమేక్ సినిమాలు చేస్తున్నప్పుడు ఒరిజినల్‌తో కంపేర్ చేయడం సహజం. ఫస్ట్ లుక్ నుంచి, ట్రైలర్ వరకు అన్నింటినీ కంపేర్ చేస్తూ వస్తున్నారు. సినిమాలో హీరోకు హీరోయిన్ ఉండదు. కామెడీ, డ్యాన్సులకు అసలు ఛాన్సే లేదు. మరి ఇలాంటి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను చిరూకి తగ్గట్టుగా ఎలా ఛేంజ్ చేసారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.
చిరంజీవి సినిమాలంటే అభిమానులు ఎన్నో ఆశిస్తారు. చిరూ ఇమేజ్‌తో పాటు అన్నీ దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ మోహన్ రాజా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. స్టోరీలోని మెయిన్ ప్లాట్‌ను తీసుకుని ఒరిజినల్ వెర్షన్ కంటే మరింత గ్రాండియర్‌గా, హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
గాడ్‌ఫాదర్‌లో చిరూ, సల్మాన్‌పై తెరకెక్కించిన పార్టీ సాంగ్‌ని సినిమాలో కాకుండా ఎండ్ టైటిల్స్‌లో ప్లే అవుతుందని చెప్పారు. అంతేకాక ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ కూడా ఉందని, కానీ అందులో చిరూ మొత్తం కనిపించడంటున్నారు.
ఈ సినిమాను అందరూ ఇప్పటికే చూశారు. అలాంటి సినిమాను చిరంజీవి మళ్లీ గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. ఆల్రెడీ తెలుగులో చూసిన చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా టాప్ లెవల్లో ఉండాలి. దానికి తోడు గాడ్‌ఫాదర్‌ను మళ్లీ మలయాళంలో డబ్బింగ్ చేస్తున్నారంటున్నారు. అంటే వాళ్లు తీసిన సినిమాను వాళ్లకే చూపిస్తున్నాం. గాడ్ ఫాదర్ ఏ మాత్రం అంచనాలకు తగ్గినా భారీ ట్రోలింగ్స్ ఎదుర్కోవలసి ఉంటుంది.
అయితే ఈ సినిమాను మోహన్ రాజా చేతిలో పెట్టినప్పుడే ఇది మెగా ప్రాజెక్ట్ అయిందని, ఆయన స్క్రిప్ట్‌లో ఏవొక కొత్త అంశాలను జోడించి ఉంటారంటున్నారు చాలా మంది. రామ్ చరణ్ ఈ సినిమాలో అంతగా ఏం ఎగ్జయిట్ చేసిందో అవే ఇప్పుడు జనాలను థియేటర్లకు రప్పించాలి. మరి గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేస్తాడో చూడాలి.













