కంగువపై నిర్మాత ఓవర్ కాన్ఫిడెన్స్
బాహుబలి(Baahubali) సినిమా తర్వాత ప్రతీ ఒక్కరూ వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఈజీగా సాధించొచ్చనే నమ్మకంతో భారీగా బడ్జెట్లు పెట్టి సినిమాలను తీసి హైప్ పెంచి రిలీజ్ తర్వాత ఫలితం బోల్తా కొట్టడంతో నష్టాల్లో కూరుకుపోయారు. తమ సినిమాలకు హైప్ పెంచడానికి వెయ్య కోట్ల అంచనాలు చెప్పే నిర్మాతలు చాలా మంది ఉన్నారు.
కానీ ఇప్పుడో తమిళ నిర్మాత ఏకంగా తమ సినిమా రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని చెప్తున్నాడు. తమిళ స్టార్ నిర్మాత జ్ఞానవేల్ రాజా(Gnanavel raja) నిర్మాణంలో సూర్య(Suriya) హీరోగా తెరకెక్కిన కంగువ(Kanguva) సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దసరాకు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి నవంబర్ 14కు వెళ్లింది. ఈ సినిమాకు వందల కోట్లలో కలెక్షన్స్ వస్తాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
కంటెంట్ బావుండి సినిమా ఆడియన్స్ కు కనెక్ట్ అయితే రూ. 1000 కోట్ల మార్క్ ను కూడా టచ్ చేసే ఛాన్సుంది. కానీ జ్ఞానవేల్ రాజా ఏకంగా రూ.2000 కోట్లు వస్తాయని చెప్పడాన్ని నెటిజన్లు రుచించుకోలేక పోతున్నారు. సౌత్ ఇండియాలో సూర్యకు మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నప్పటికీ నార్త్ లో పెద్దగా గుర్తింపు లేదు. ఇప్పటివరకు సూర్య సినిమాల్లో ఏ సినిమా రూ.300 కోట్లను కూడా టచ్ చేయలేదు. అలాంటప్పుడు కంగువ రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని చెప్పడం ఓవర్ కాన్ఫిడెన్సే అవుతుంది తప్పించి సినిమాపై నమ్మకం మాత్రం అవదు.













