కంగువ పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తమిళ స్టార్ హీరో సూర్య, శివ దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా సినిమా కంగువ. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ప్రెజెంట్, పాట్ కలిపి ఈ సినిమాలో డైరెక్టర్ శివ ఆడియన్స్ కు చూపించబోతున్నాడు.
కంగువలో సూర్య ఓ క్యారెక్టర్ లో ట్రైబల్ వారియర్ గా కనిపించనున్నాడు. ఆ క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా ఉండనుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ సినిమాపై అంచనాల్ని బాగా పెంచుతుంది. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి రూ.1000 కోట్ల సినిమా వస్తుందని అందరూ ఎంతో బలంగా నమ్ముతున్నారు.
ఇప్పటికే కంగువకు సంబంధించిన బిజినెస్ చాలా వరకు పూర్తైందట. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాకు పోటీగా ఎవరైనా రావొచ్చు. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ గురించి అవగాహన ఉండదు కాబట్టి. కానీ కంగువ రిలీజ్ అయ్యాక దానికి సీక్వెల్ గా రాబోయే పార్ట్2కి మాత్రం ఎవరూ పోటీగా రావడానికి ధైర్యం చేయరని, ఈ విషయాన్ని తాను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నానని చెప్పారు. జ్ఞానవేల్ రాజా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













