బిగ్‌బాస్ లో హల్ చల్ చేయనున్న ఐదుగురు గ్లామర్ గళ్స్
కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం దేశం లాక్డౌన్ నుంచి అన్‌లాక్ అయింది. ఇక ఎవరి జాగ్రత్తలో వారే ఉండాలని, ఎవరి ప్రాణాలకు వారే బాధ్యత వహించాలని ప్రభుత్వం సూచించింది. అన్‌లాక్ తర్వాత ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ అన్ని రంగాలూ ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రపదేశ్ ప్రభుత్వాలు షూటింగులకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో కొన్ని చిన్న సినిమాల షూటింగులు, టీవీ సీరియల్స్, టీవీ షోల షూటింగులు జరుగుతున్నాయి. ఇక పెద్ద సినిమాల విషయానికి వస్తే స్టార్ హీరోలెవరూ జనవరి వరకు షూటింగ్లో పాల్గొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు. ఇక అందరూ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ సీజన్ 4 కూడా రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగా కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు నిర్వాహకులు. నవంబర్ చివరిలో ఈ రియాల్టీ షో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు కరోన వైరస్ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అన్నీ సద్దుమణిగితే సజావుగా షూటింగ్ చేసుకోవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ షో మరింత కలర్ ఫుల్‌గా ఉండడానికి ఐదుగురు హీరోయిన్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. వీళ్లలో ముంబాయి హాట్ గాళ్ శ్రద్దాదాస్తోపాటు హీరోయిన్ హంసా నందిని, మోనా అనే మోడల్, తెలుగమ్మాయి ప్రియా వడ్లమాని, యామిని భాస్కర్ తమ గ్లామర్‌తో రచ్చ చేయబోతున్నట్టు సమాచారం. వీరితోపాటు బిత్తిరి సత్తి, హీరో తరుణ్, మంగ్లీ, మరో హాట్ యాంకర్ వర్షిణి సౌందర్‌రాజన్, సీరియల్ నటుడు అఖిల్ సార్ధక్ బిగ్‌బాస్ సీజన్ 4లో వినిపిస్తున్న పేర్లు. ఇక నాలుగో సీజన్‌కు హీరోయిన్ సమంత హోస్ట్‌గా వ్యవహరిస్తుందని వార్తలు వస్తున్నాయి. మరోపక్క నాగార్జున పేరు కూడా వినిపిస్తోంది. మరి ఫైనల్‌గా వీరిద్దరిలో ఎవరు ఈ షోను హ్యాండిల్ చేస్తారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.













