Genelia: భర్త టార్చర్ చేశాడంటున్న జెనీలియా

హాసినిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జెనీలియా(Genelia) ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. బొమ్మరిల్లు (Bommarillu), ఢీ(Dhee), రెడీ(Ready), సై(Sye) సినిమాలతో మంచి హిట్లు అందుకున్న జెనీలియా ఎన్టీఆర్(NTR) దగ్గర్నుంచి రామ్(Ram), నితిన్(Nithin) వరకు యంగ్ హీరోలందరితో జత కట్టింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా జెనీలియా పలు సినిమాలు చేసింది తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్(Ritesh Deshmukh)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న జెనీలియా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లైన జెన్నీ వారి కోసం సినిమాల జోలికి రాలేదు. ఇప్పుడు వాళ్లు పెద్దవడంతో మళ్లీ సినిమాల్లోకి వచ్చి కెరీర్లో బీజీ అవాలని చూస్తోంది. అందులో భాగంగానే మొన్నా మధ్య మరాఠా సినిమా వేద్(Vedh) చేసింది.
కాగా ఇప్పుడు కిరిటీ(Kireeti) హీరోగా శ్రీలీల(Sree Leela) హీరోయిన్ గా తెరకెక్కిన జూనియర్(Junior) సినిమాలో కూడా జెనీలియా ఓ కీలక పాత్ర చేశారు. జూనియర్ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న జెనీలియా తన రీఎంట్రీ గురించి, తన భర్త గురించి సంచలన కామెంట్స్ చేసింది. మూడేళ్లుగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వమని తన భర్త రితేష్ తనను టార్చర్ చేస్తున్నాడని, అది తట్టుకోలేకనే సినిమాల్లోకి వచ్చానని జెనీలియా చెప్పగా ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.