క్రికెటర్ల బయోపిక్ ప్లానింగ్ లో గౌతమ్ మీనన్
లవ్ స్టోరీలతో మనసును హత్తుకునే సినిమాలను తీయడంలో దిట్ట అయిన గౌతమ్ మీనన్, ప్రస్తుతం డైరెక్టర్ గా కంటే నటుడిగానే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. విలక్షణ నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకున్న గౌతమ్ మీనన్ నుంచి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది.
గౌతమ్ మీనన్ ఈ సారి ప్రేమ కథా చిత్రం కాకుండా క్రికెట్ లవ్ స్టోరీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇండియన్ క్రికెట్ గురించి మాట్లాడాలంటే సచిన్ గురించి, అలానే సచిన్ ప్రస్థావన్ వచ్చిన ప్రతిసారి కచ్చితంగా వినోద్ కాంబ్లే గురించి డిస్కషన్ వస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య క్రికెటర్ బయోపిక్స్ వచ్చి సూపర్ హిట్ అవుతున్న నేపథ్యంలో గౌతమ్ మీనన్ కూడా అలాంటి బయోపిక్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
అప్పటి వారికి సచిన్, వినోద్ కాంబ్లేల ఫ్రెండ్షిప్, గేమ్ గురించి తెలుసు. వారి గురించి తెలియని ఈ తరం వారి కోసం గౌతమ్ మీనన్ ఓ సినిమా చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన ఇండియా-న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు హాజరైన గౌతమ్ మీనన్ క్రికెట్ నేపథ్యంలో సినిమా తీయబోతున్నట్లు చెప్తూ దానికోసం కథను కూడా రెడీ చేసినట్లు పేర్కొన్నాఆడు. ఇది కచ్ఛితంగా క్రికెట్ మరియు మూవీ లవర్స్ కు కిక్కిచ్చే న్యూసే.













