విశ్వక్ మూవీ పోస్ట్‌పోన్ తప్పేలా లేదు
విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డిసెంబర్ 8న రిలీజ్ కు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడా సినిమా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. వాయిదా పడ్డట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కానీ రిలీజ్ చేసే ఛాన్స్ ఏ మాత్రం లేనట్లు తెలుస్తోంది. 29న రిలీజ్ చేద్దామని అనుకున్నా, మరో పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో అది కూడా డౌటేనని టాక్ వినిపిస్తోంది.
ఇక జనవరిలో రిలీజ్ చేద్దామంటే సంక్రాంతి సినిమాలున్నాయి. సంక్రాంతికి బరిలో ఉన్న సినిమాలకే థియేటర్లు దొరకని పరిస్థితి. దీంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మార్చిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ లో విశ్వక్సేన్ గాయపడినట్లు తెలుస్తోంది. డాక్టర్లు కొన్నాళ్ల పాటూ రెస్ట్ తీసుకోమని చెప్పారట.
దానికి తోడు బ్యాలెన్స్ షూటింగ్ కోసం అంజలి లాంటి ఆర్టిస్టుల డేట్స్ అందుబాటులో లేకపోవడం కూడా ఒక సమస్యగా చెప్తున్నారు. దీంతో ఈ సినిమా పోస్ట్ పోన్ తప్పనిసరి అని క్లారిటీ వచ్చేసింది. వాయిదా పడిన గ్యాంగ్ ఆఫ్ గోదావరికి ఫిబ్రవరి లేదా మార్చిలోనే సోలో రిలీజ్ కు ఛాన్సుంది. తర్వాత ఏప్రిల్ లో దేవర, కంగువా, ఇండియన్2 వచ్చే అవకాశాలున్నాయి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.













