Game Changer: గేమ్ ఛేంజర్ సెన్సార్ టాక్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్(Game changer) రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో పది రోజుల్లో గేమ్ ఛేంజర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత చరణ్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో జనవరి 10న రిలీజ్ కానున్న గేమ్ ఛేంజర్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా గేమ్ ఛేంజర్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ టాక్ ప్రకారం సినిమా అదిరిపోయిందంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని, ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోయిందని టాక్ వినిపిస్తుంది. శంకర్ సినిమాను సెకండాఫ్ లో పరుగులు పెట్టించాడని అంటున్నారు.
దీన్ని బట్టి చూస్తుంటే గేమ్ ఛేంజర్ ప్రతీ ప్రేక్షకుడినీ కుర్చీ అంచున కూర్చోబెట్టడం ఖాయమని తెలుస్తోంది. మూవీ రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలని, సెన్సార్ బోర్డు నుంచి గేమ్ ఛేంజర్ కు యూఏ సర్టిఫికేట్ వచ్చిందని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కియారా అద్వానీ(Kiara Advani), అంజలి(Anjali) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.













