Game Changer: గేమ్ ఛేంజర్ సినిమాకు పెద్ద రిలీఫ్
న్యూ ఇయర్ సందర్భంగా ఏదొక అప్డేట్ వస్తుందనుకుంటే లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) నుంచి అజిత్(Ajith) ఫ్యాన్స్ కు షాకిచ్చే అప్డేట్ వచ్చింది. విడాముయార్చి(Vidamuyarchi) సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడం లేదని అనౌన్స్ చేయడం లేదని చెప్పడంతో ఒక్కసారిగా అజిత్ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. ఈ సినిమా కోసమే మైత్రీ బ్యానర్(Mythri Movie Makers) గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly)ని పోస్ట్ పోన్ చేసుకుంది.
కానీ ఇప్పుడు సీన్ చూస్తే అజిత్ ఫ్యాన్స్ కు ఏదీ లేకుండా పోయింది. దీంతో కోలీవుడ్ సంక్రాంతికి సరైన పెద్ద స్టార్ హీరో సినిమా లేకపోవడం కోలీవుడ్ బాక్సాఫీస్ కు షాకనే చెప్పాలి. అయితే అజిత్ సినిమా వాయిదా పడటం రామ్ చరణ్(Ram Charan) కు చాలా ఊరట కలిగించింది. దానికి కారణం గేమ్ ఛేంజర్(Game Changer) కు తమిళనాడులో ఎన్ని థియేటర్లు దొరుకుతాయో అని అనుమానపడ్డారు.
పోటీలో అజిత్ సినిమా ఉంటే తప్పకుండా అందరి ఫోకస్ ముందుగా దానిపైనే ఉంటుంది. ఇప్పుడు అజిత్ సినిమా లేదు కాబట్టి గేమ్ ఛేంజర్ కు క్రేజ్ పెరగడం ఖాయం. ఇప్పటికే కోలీవుడ్ వర్గాల్లో గేమ్ ఛేంజర్ గురించి ఇన్సైడ్ టాక్ చాలా పాజిటివ్ గా ఉంది. ఇదే నిజమైతే మంచి ఓపెనింగ్స్ తో పాటూ లాంగ్ రన్ దక్కే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి.













