చాలా కొత్తగా ఉండనున్న గామి
భిన్నమైన సినిమాలను చేస్తూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్. ప్రతి సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉండేలా చూసుకుంటాడు విశ్వక్. ప్రస్తుతం ఆయన హీరోగా విద్యాధర్ కగిత దర్శకత్వంలో వస్తున్న అడ్వెంచర్ డ్రామా గామి. అనౌన్స్మెంట్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
క్రౌడ్ ఫండెడ్ అడ్వెంచర్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో విశ్వక్సేన్ అఘోరా పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడట. అతను మానవ స్పర్శను అనుభవించలేడట. ఆ వ్యాధి నివారణ కోసం విశ్వక్ హరిద్వార్ నుంచి హిమాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. అతని శారీరక సమస్యకు నివారణ కోసం ఈ అన్వేషణ అంతర్గత ప్రయణానికి దారి తీస్తుందని తెలుస్తోంది.
చూస్తుంటే ఇలాంటి కథతో ఇప్పటివరకు ఎలాంటి సినిమా రాలేదు. కథ పరంగా గామి చాలా కొత్తగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడో ఐదేళ్ల కిందట మొదలైంది. చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉండబోతుందని విశ్వక్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. మరి గామి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.













