రెండో రోజుకే యూఎస్‌లో గామికి బ్రేక్ ఈవెన్
శివరాత్రి సందర్భంగా రిలీజైన సినిమాల్లో గామ మూవీ ఎంతో స్పెషల్. ఈ సినిమా పూర్తి కావడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరేళ్లు టైమ్ పట్టింది. కొత్త డైరెక్టర్ యంగ్ టీమ్ ను పెట్టుకుని లిమిటెడ్ బడ్జెట్ తో ఎంత కష్టపడ్డాడో మేకింగ్ వీడియోలు, ప్రోమోలు చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ సినిమా రిలీజయ్యాక ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి టీమ్ ఆ కష్టాన్నంతా మర్చిపోయింది.
ప్రయోగాత్మక కథతో తెరకెక్కిన ఇలాంటి సినిమాలను ఆడియన్స్ ఏ మేరకు ఆదరిస్తారు? కమర్షియల్ గా గామి ఎంతవరకు సక్సెస్ అవుతుందనే అనుమానాలు రిలీజ్ కు ముందు చాలానే వ్యక్తమయ్యాయి కానీ గామి అందరి అంచనాలకు మించి మంచి వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజే ఈ సినిమా రూ.9 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. సెకండ్ డే కూడా రూ.6 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి.
ఇదిలా ఉంటే గామి సినిమా ఓ ఏరియాలో రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ అవడం విశేషం. అమెరికాలో శనివారం షోలు పూర్తయ్యేసరికే 4 లక్షల డాలర్ల మార్క్ ను అందుకుంది. బయ్యర్ పెట్టిన పెట్టుబడి మొత్తం శనివారానికే వచ్చేసింది. ప్రీమియర్స్ నుంచే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాకు శుక్ర, శనివారాల్లో కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. యూఎస్ ఆడియన్స్ టేస్ట్ కు తగ్గ క్లాస్, డిఫరెంట్ సినిమా కావడంతో గామికి అక్కడ మంచి ఆదరణ లభించింది. చూస్తుంటే ఫుల్ రన్ లో గామి మిలియన్ డాలర్ మార్కును అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లే వస్తున్నాయి. త్వరలోనే గామి ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయి.













