డిజాస్టర్ డైరెక్టర్‌గా మెహర్ రమేష్
మెహర్ రమేష్ అంటే టాలీవుడ్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక డైరెక్టర్ కి హిట్స్ కంటే కూడా డిజాస్టర్స్ నే ఎక్కువ ఉన్నాయంటే అతను మరెవరో కాదు ‘ మెహర్ రమేష్’ అనే చెప్పాలి. ప్రస్తుతం హ్యాట్రిక్ డిజాస్టర్స్ ని మూట కట్టుకొన్న మెహర్ రమేష్ 2004లో ఆంధ్రావాలా, 2006లో ఒక్కడు మూవీలను కన్నడలో రీమేక్ చేసి హిట్ ని ఖాతాలో వేసుకొని తన ప్రయాణం మొదలు పెట్టారు. 2008లో జూనియర్ ఎన్టీఆర్ కంత్రి మూవీతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమైన మెహర్ రమేష్‌కు, హీరోని సరికొత్త కోణంలో చూపించినా హిట్ మాత్రం దక్కలేదు. ఆ తరువాత బిల్లా రీమేక్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసాడు. ఈ సినిమా క్కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే కొంత గ్యాప్ తీసుకోని మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తో శక్తి అనే మూవీని తీశారు, ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ నష్టం తీసుకొచ్చిన చిత్రంగా చెప్పుకోవచ్చు.
తర్వాత ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా విక్టరీ వెంకటేష్ తో షాడో అనే సినిమాని డైరెక్ట్ చేయగా ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అన్ని డిజాస్టర్స్ ని తన లిస్ట్ లో చేర్చుకొన్న ఈ డైరెక్టర్ కి ఏ హీరో కూడా అవకాశం ఇవ్వడం లేదు. అయితే దాదాపుగా 10 సంవత్సరాలు టాలీవుడ్ కి దూరమైన మెహర్ రమేష్ కు దూరపు బంధువైన మెగాస్టార్ చిరంజీవి వేదాళమ్ రీమేక్ అప్పగించారు. అదే రీసెంట్ గా రిలీజ్ అయిన భోళా శంకర్. ఈ మూవీ కూడా డిజాస్టర్ లిస్టులోకి చేరిందనే చెప్పాలి. దీంతో పాటు బోనస్ గా చిరంజీవి ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యింది.
ఇలా డిజాస్టర్లు వల్ల ప్రొడ్యూసర్స్ కి చాలానే నష్టముందని చెప్పాలి. శక్తి మూవీతో అశ్వనీదత్ కి 50 కోట్లు, షాడో తో పరుచూరి కిరీటి కి 20 కోట్లు, ఇక భోళా శంకర్ మూవీతో అనిల్ సుంకరకి 50 కోట్లు నష్టం వచ్చిందని టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా వరుస డిజాస్టర్స్ తో మెహర్ రమేష్ తన ప్రొడ్యూసర్స్ కి 100 కోట్ల నష్టాన్ని కలిగించారనే చెప్పాలి. ఇక పైన ఈ డైరెక్టర్ ని నమ్మి ఏ హీరో తన డేట్స్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.













