నాగకన్య ఫస్ట్ లుక్ విడుదల
వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి, ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు. జంబో సినిమాస్ బ్యానర్‌పై ఏ.శ్రీధర్ నిర్మాతగా ఎల్.సురేష్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ విభిన్నమైన లుక్‌తో విడుదల చేసిన ఈ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెప్పింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ మా సినిమా మొదటి పోస్టర్‌గా విడుదల చేశాం. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. జై క్యారెక్టర్ మరో హైలెట్‌గా నిలుస్తుంది. డైరెక్టర్ సురేష్ స్టోరీ, స్క్రీన్ ప్లే క్యూరియసిటీ రేకెత్తిస్తుంది. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకొస్తాం. వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ పాత్రలు వూహించని విధంగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కు మంచి పేరొచ్చేలా ఉంటుందని అని అన్నారు.













