విజయా వాహిని వెంకట్రామిరెడ్డి ఇకలేరు
ప్రముఖ నిర్మాత బి.నాగిరెడ్డి కుమారుడు, నిర్మాత బి.వెంకట్రామరెడ్డి (75) అనారోగ్యంతో చైన్నైలో కన్నుమూశారు. ఆయన తెలుగులో చందమామ విజయ కంబైన్స్‌పై బాలకృష్ణతో బైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జునం విజయం, రాజేంద్రప్రసాద్‌తో బృందావనం తదితర చిత్రాలను నిర్మించారు. తమిళంలో అజిత్‌తో వీరం, విజయ్‌తో భైరవ, తామిరభరణి, పడిక్కాదవన్, వేంగై లాంటి పలు చిత్రాలు నిర్మించారు. విజయ్ సేతుపతితో ఆయన నిర్మిస్తున్న సంఘ తమిళన్ చిత్రీకరణ దశలో ఉంది. వెంకట్రామిరెడ్డికి భార్య భారతిరెడ్డి, కుమారుడు రాజేష్, కుమార్తెలు ఆరాధన, అర్చన ఉన్నారు. చైన్నైలోని నెసపాక్కంలో అంత్యక్రియలు జరగనున్నాయి. వెంకట్రామిరెడ్డి మృతిపట్ల ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.













