టాలీవుడ్‌ను కట్టిపడేయనున్న తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్
ఆడియన్స్ ను రాబోయే రోజుల్లో సెంటిమెంట్ టచ్ ఉన్న సినిమాలు ముంచెత్తబోతున్నాయి. విక్రమ్ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న లియో సినిమాలో తండ్రి-కూతురు సెంటిమెంట్ ఉందని పోస్టర్లు, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. విక్రమ్ సినిమాలో తాత- మనవడు సెంటిమెంట్‌తో సినిమాను నడిపించిన లోకేష్, ఈసారి లియోలో తండ్రి-బిడ్డ సెంటిమెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక అదే రోజు రిలీజ్ కానున్న నందమూరి బాలకృష్ణ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ల సెంటిమెంటే మెయిన్ హైలైట్ అని తెగ ప్రచారం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. వారిద్దరి బంధమేంటనేది క్లారిటీ లేకపోయినా, తండ్రీ కూతుళ్ల బంధంలాగే కనిపిస్తుంది.
తర్వాత డిసెంబర్ లో రిలీజ్ కానున్న నాని సినిమా హాయ్ నాన్న. టైటిల్లోనే స్టోరీ ఏంటనేది అర్థమైతుంది కదూ. తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో ఈ సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుందని తెలుస్తోంది. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ కూడా ఆ ఎమోషన్‌తోనే సాగింది. తర్వాత సంక్రాంతికి రానున్న సైంధవ్ మూవీ కూడా తండ్రి, కూతురు సెంటిమెంట్‌తోనే రానుంది. అంటే టాలీవుడ్ ప్రేక్షకుల్నిను రాబోయే సినిమాలు తండ్రీ-కూతురు ఎమోషన్‌తో కట్టిపడేయనున్నాయన్న మాట.













