మెగా న్యూస్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
మరో నాలుగు రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రానుంది. ఈ సందర్భంగా విశ్వంభర టీజర్ తో పాటూ ఇంద్ర సినిమాను రీరిలీజ్ చేసి గ్రాండ్ గా చిరూ బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. ఇవన్నీ పక్కనపెడితే చిరూ బర్త్ డే సందర్భంగా ఆయన తర్వాతి సినిమా అనౌన్స్మెంట్ ఏమైనా వస్తుందా లేదా అనేది ఇంంకా సస్పెన్స్ గానే ఉంది.
చిరూని పలువురు డైరెక్టర్లు కలిసి కథలు చెప్తున్నారు. కానీ వాటిలో ఏది ఫైనల్ అవుతుందో మెగా వర్గాలు కూడా చెప్పలేకపోతున్నాయి. హరీష్ శంకర్ చిరూతో సినిమా చేయాలని ట్రై చేశాడు కానీ అది వర్కవుట్ అవకపోవడంతో వేరే ప్రాజెక్ట్ ను లాక్ చేసుకున్నాడని టాక్. అనుదీప్ లాంటి డైరెక్టర్లు కూడా చిరూకి కథ చెప్పినప్పటికీ అన్నీ డిస్కషన్స్ దగ్గరే ఆగిపోయాయి.
ఇక బ్యాలెన్స్ ఉంది మోహన్ రాజా దర్శకత్వంలో బీవీఎస్ రవి కథతో వచ్చే సినిమానే. ఈ సినిమా ఫైనల్ వెర్షన్ ఓకే అయుంటే దీనికి సంబంధఙంచిన అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సుంది. ఒకవేళ అది కూడా ఇంకా ఫైనల్ అవకపోతే వాయిదా పడే ఛాన్సుంది. విశ్వంభర షూటింగ్ దాదాపు పూర్తైపోయింది కాబట్టి వీలైనంత త్వరగా డెసిషన్ తీసుకుంటే ఎక్కువ గ్యాప్ లేకుండా చిరూ సినిమాను పూర్తి చేసేయొచ్చు.













