పండగ చేసుకుంటున్న ఎన్టీఆర్ అభిమానులు
ఎన్టీఆర్ బర్త్‌డే కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ బర్త్‌డేకి ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని ఎన్టీఆర్ లుక్ విడుదల చేస్తారని ఎంతో ఆశతో ఎదురుచూశారు. కానీ, రెండు రోజుల క్రితం ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఓ ప్రకటన చేస్తూ ఎన్టీఆర్ బర్త్‌డేకి ఫస్ట్లుక్గానీ, టీజర్కానీ విడుదల చేయడం లేదని తెలిపారు. ఆ ప్రకటనతో అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. ఎన్టీఆర్ బర్త్‌డేని ఘనంగా జరపాలన్న వారి కోరిక కూడా తీరడంలేదు. ఎందుకంటే తన బర్త్‌డేకి ఎవరూ రావద్దని, వేడుకలు జరపవద్దని ఎన్టీఆర్ తెలిపారు. దీంతో ఈసారి తమ అభిమాన హీరోకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉండదని నిరుత్సాహానికి గురయ్యారు అభిమానులు.
ఇప్పడా నిరాశను దూరం చేస్తూ అభిమానుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతూ ఎన్టీఆర్ కొత్తలుక్ విడుదలైంది. ఎన్టీఆర్‌కు ఫిట్నెస్ ట్రైనర్ అయిన లాయిడ్ స్టీవెన్స్ బుధవారం తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల కోసం నాదగ్గర ఓ స్పెషల్ గిఫ్ట్ ఉంది. దాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అంటూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. చెప్పినట్టుగానే ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటోను షేర్ చేస్తూ ఎవరూ ఇప్పటివరకు చూడని తారక్ ఫోటోను మీతో షేర్ చేసుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది అంటూ ట్వీట్ చేశారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా ఓ గొప్ప పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసమే ఎన్టీఆర్ బాగా వర్కవుట్ చేసి సిక్స్‌ప్యాక్‌తో రెడీ అయ్యారు. ఈ బర్త్‌డేకి విడుదలైన ఎన్టీఆర్ కొత్తలుక్‌ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.













