ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అప్పుడేనా?
సంక్రాంతి బరిలోకి ఫ్యామిలీ స్టార్ లేట్ గా వచ్చినప్పటికీ వెనక్కి తగ్గేదేలే అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నిర్మాత దిల్ రాజు. కానీ సినిమాలోని కీలక షెడ్యూల్ కోసం ఫారిన్ లో షూట్ చేయాల్సి ఉంది. దానికి వీసా సమస్యల కారణంగా లేటవుతుంది. దీంతో సంక్రాంతి టార్గెట్ ను రీచ్ అవడం కష్టమని తెలిసిపోయింది.
దానికి తోడు సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉండటంతో ఓపెనింగ్స్ కూడా షేర్ అవడం పక్కా. అందుకే ఫ్యామిలీ స్టార్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా వాయిదా పడటం ఖాయమైనప్పటికీ, ఆ విషయాన్ని డైరెక్ట్ గా అనౌన్స్ చేయకుండా, ఒకేసారి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుని అప్పుడే అనౌన్స్ చేయాలని చూస్తున్నారట మేకర్స్.
సంక్రాంతి తర్వాత మంచి రిలీజ్ దొరకాలంటే సమ్మర్ కు వెళ్లాల్సిందే. సమ్మర్ అంటే ఏప్రిల్ నుంచి పెద్ద సినిమాల సందడి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి సమ్మర్ స్టార్టింగ్ లోనే ఫ్యామిలీ స్టార్ ను దింపాలని చూస్తున్నాడట దిల్ రాజు. మార్చి మార్చి మధ్యలోనే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం. దానికోసం సరైన డేట్ చూసుకుని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారట.













