ఫిబ్రవరి లో ఎగ్జయిటెడ్ మూవీస్
సినీ ప్రేమికులకు సలార్ మూవీతో సంక్రాంతి ముందుగానే వచ్చినట్లుంది. ఎంతోకాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న హిట్ సలార్ రూపంలో వారికి దక్కింది. వచ్చే వారం కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా రిలీజ్ కానుంది. అదే రోజున యాంకర్ సుమ కొడుకు నటించిన బబుల్గమ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ తర్వాత సంక్రాంతి రేసులో వరుసగా స్టార్ హీరోలందరూ ఉన్నారు. మహేష్ గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్, నాగార్జున నా సామిరంగ సినిమాతో పాటూ అప్కమింగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన హను మాన్ కూడా రిలీజ్ కానుంది. వీటిలో ఏ సినిమాకు ఆ సినిమానే డిఫరెంట్ జానర్లో తెరకెక్కింది.
జనవరి తర్వాత రానున్న ఫిబ్రవరి నెలలో కూడా ఈ సారి థియేటర్లు కళకళలాడనున్నాయి. ఆ నెల మొదటి వారంలోనే చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఫిబ్రవరి 8న యాత్ర2 రిలీజ్ అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఆ మరుసటి రోజున సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న టిల్లూ స్వ్కేర్ కూడా రిలీజ్ కానుంది.
దీంతో పాటూ సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఊరు పేరు భైరవకోన కూడా అదే రోజున రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత వారం వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ ఫిబ్రవరి 16న రిలీజ్ కు షెడ్యూల్ అయింది. వీటితో పాటూ మరికొన్ని అనువాద చిత్రాలు కూడా ఫిబ్రవరిలో రిలీజ్ కానున్నాయి. మొత్తానికి ఫిబ్రవరి నెల మొత్తం ఎగ్జయిటింగ్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.













