Mohini: డిప్రెషన్ తో ఏడు సార్లు చనిపోవాలనుకున్నా

సౌత్ లో పలు సినిమాలు చేసి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మోహిని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ గురించి, లైఫ్ లో తాను ఎదుర్కొన్న కొన్ని వింత ఎక్స్‌పీరియెన్స్‌లను షేర్ చేసుకున్నారు. అప్పట్లో స్టార్ హీరోలందరితోనూ నటించిన మోహిని(Mohini) కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే 1991లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయారు.
పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో మోహిన నటించారు. ఆమె నుంచి ఆఖరిగా 2011లో సినిమా వచ్చింది. పెళ్లి తర్వాత భర్త, పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నానని, కానీ కొంత కాలానికి ఉన్నట్టుండి తాను డిప్రెషన్ లోకి వెళ్లానని చెప్పుకొచ్చారు మోహిని. అయితే తాను అలా నిరాశ చెందడానికి రీజనేమీ లేదని, ఎప్పటిలానే తన లైఫ్ చాలా బావుందని మోహిని తెలిపారు.
లైఫ్ లో హ్యాపీగా ఉన్నా డిప్రెషన్(Depression) కు ఎందుకెళ్లానో అర్థమయ్యేది కాదని, ఆ టైమ్ లో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించానని, అది ఒకసారి కూడా కాదు, ఏకంగా ఏడుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశానని మోహిని చెప్పుకొచ్చారు. కాగా తాను డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఓ జ్యోతిష్కుడిని కలవగా ఆయన తనపై ఎవరో మంత్ర పూజలు చేశారని చెప్పారని, అది విని మొదట్లో నవ్వుకున్నప్పటికీ తర్వాత నిజమని నమ్మి భగవంతుని ఆశీస్సులతో దాన్నుంచి బయటపడ్డానని మోహిని వెల్లడించారు.