‘ఎవరు’ ప్రీరిలీజ్ వేడుక
అడివిశేష్, రెజీనా కనంద్ర, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ్యానర్‌పై రూపొందుతున్న థ్రిల్లర్ ఎవరు. వెంకట్ రామ్‌జీ దర్వకుడు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి. పొల్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ సినిమాను చాలాసార్లు చూశానని, బాగా ఎంజాయ్ చేశానని తెలిపారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అన్నారు. శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ ట్విస్టులతో సినిమా మా దగ్గరకు వచ్చిందని నాకు ఛాలెంజింగ్ మూవీ అన్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాల కంటే ఇదే టఫ్ మూవీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ చంద్ర, రెజీనా, శ్రీచరణ్ పాకాల, వెంకట్ రామ్‌జీ తదితరులు పాల్గొన్నారు.













