ప్రశాంత్ వర్మ- రణ్వీర్ కాంబో వార్తలకు ఎండ్ కార్డ్
ఈ ఏడాది హనుమాన్ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సంపాదించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా తర్వాత జై హనుమాన్ ను సీక్వెల్ గా అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ ఆ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేసుకుంటున్న తరుణంలో రణ్వీర్ సింగ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా ఆఫర్ రావడం, బ్రహ్మరాక్షస అనే టైటిల్ తో ఆ సినిమా తెరకెక్కిందని వార్తలు రావడం జరిగాయి.
కానీ హీరో- డైరెక్టర్ మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని అందుకే ఈ సినిమా ఆగిపోనుందని వార్తలొచ్చాయి. మళ్లీ లేదు సినిమా జరుగుతుందన్నారు. మొత్తానికి గత వారం పదిరోజులుగా ముంబై నుంచి హైదరాబాద్ వరకు అన్ని మీడియాల్లోనూ ఈ సినిమా బాగానే హైలైట్ అయింది. అయితే ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెడుతూ చిత్ర టీమ్ అఫీషియల్ నోట్ ఇచ్చింది.
ఆ నోట్ లో చెప్పిన దాన్ని బట్టి అయితే ఈ సినిమా కొనసాగడం లేదని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ లాంటి స్పెషల్ టాలెంట్ ఉన్న వాళ్లతో కలిసి పని చేయాలని చూసినా వీలు పడలేదని, ఫ్యూచర్లో జరుగుతుందనే ఆశాభావాన్ని రణ్వీర్ వ్యక్తం చేస్తే, రణ్వీర్ ఎనర్జీ, టాలెంట్ అరుదుగా దొరుకుతుందని, త్వరలో తమ కాంబో సాధ్యం కావాలని వెయిట్ చేస్తుంటానని ప్రశాంత్ వర్మ అన్నాడు. ఇక మైత్రీ మాత్రం టైమ్ వచ్చినప్పుడు అన్నీ కుదురుతాయని ఈ వార్తలన్నింటికీ ఎండ్ కార్డ్ వేసింది. మొత్తానికి ప్రశాంత్ వర్మ బాలీవుడ్ సినిమా ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు జై హనుమాన్ కు సంబంధించిన పనులు ఊపందుకునే ఛాన్సుంది.













