ఈషాకు జాక్ పాట్
తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా హీరోయిన్గా సత్తా చాటుకున్నా టాలీవుడ్లో మాత్రం ఆమె ఇంకా టాప్ లీగ్‌ను చేరుకోలేదు. తన కెరీర్లో మొదటిసారి ఎన్టీఆర్‌లాంటి స్టార్ హీరోతో ఆమె నటిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆమె చేస్తున్న అరవింద సేమత కనుక హిట్ అయితే తన కెరీర్ ఊపందుకోవడం ఖాయం. ఎన్టీఆర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ కాబట్టి విడుదల తర్వాత కానీ ఈషా పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో చెప్పలేం. ఇదిలా ఉండగా అరవింత సేమత విడుదల కాకముందే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తాజా చిత్రం ఎస్ఆర్కె లో ఈషాకు హీరోయిన్గా నటించే అవకాశం వచ్చిందట. ఈ సినిమా డిసెంబర్లో సెట్స్‌పైకి వెళ్తుందని తెలిసింది. శాండల్పుడ్లో టాప్ స్టార్ అయిన శివరాజ్‌కుమార్ సినిమాలో ఛాన్స్ అంటే ఈషాకు జాక్‌పాట్ తగిలినట్టే. ఈ సినిమాలో శివరాజ్ డాన్స్ మాస్టర్‌గా నటిస్తాడట. హీరోయిన్ ఈషా ఒక లెక్చరర్ పాత్రలో కనిపిస్తుందట. నూతన దర్శకుడు లక్కీ గోపాల్ తెరకెక్చించే ఈ సినిమాను కిరణ్ గౌడ నిర్మిస్తాడు. పీటర్ హెయిన్స్ ఈ చిత్రాన్ని స్టంట్ మాస్టర్.













