Eesha Rebba: క్యూట్ లుక్ లో అదరగొడుతున్న తెలుగమ్మాయి
తెలుగమ్మాయి ఈషా రెబ్బా(Eesha Rebba) లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(Life Is Beautiful) సినిమాలో చిన్న క్యారెక్టర్ లో కనిపించి మెప్పించింది. అప్పట్నుంచి ఈషా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టు గా కూడా ఈషా పలు సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లో కంటే సోషల్ మీడియా ద్వారానే ఈషా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు చేరువలో ఉండే ఈషా తాజాగా వైట్ డ్రెస్ ధరించి లూజ్ హెయిర్ తో చాలా సింపుల్ లుక్స్ తోనే నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈషా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













