OG: పవన్ ఫ్యాన్స్ కు నిర్మాణ సంస్థ విన్నపం
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. నిత్యం ప్రజా పాలనలో ఉంటూ పలు సమస్యల కోసం కష్టపడుతున్నాడు. ఇవన్నీ మర్చిపోయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన ఎక్కడ కనిపించినా సినిమా గురించి అప్డేట్స్ అడుగుతున్నారు. రీసెంట్ గా పవన్(Pawan) ప్రజా పర్యటనలో ఉన్నప్పుడు జనంలో నుంచి ఓజీ అంటూ కేకలు వినిపించాయి.
ఎలక్షన్స్ ముందంటే ఇవన్నీ ఓకే కానీ పవన్ గెలిచి అధికారంలోకి వచ్చాక వాళ్లు ఇలానే ప్రవర్తించడం పవన్ కు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. తాజాగా గాలివీడు ఎంపీడీఓ శ్రీ జవహర్ బాబు(Javahar Babu)ను పరామర్శించాక పవన్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఓజి (OG) అంటూ కేకలు వేయడంతో ఆయన అసహనానికి గురయ్యారు.
దీంతో ఏకంగా ఓజి నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్(DVV Entertainments) ఫ్యాన్స్ కు ఓ లెటర్ ను రిలీజ్ చేసింది. ఓజిని మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం కష్టపడుతున్నామని, సమయం సందర్భం లేకుండా ఓజి ఓజి అని పొలిటికల్ సభల్లో నినాదాలు చేయడం తగదని, కొంచెం ఓపికతో వెయిట్ చేస్తే 2025లో వైభవాన్ని చూపిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి నుంచైనా పవన్ ఫ్యాన్స్ కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించి పవన్ కు మద్దతుగా నిలిస్తే బావుంటుందని అందరూ కోరుతున్నారు.













