Dulquer: దుల్కర్ కాంతాపై భారీ అంచనాలు
దుల్కర్ సల్మాన్(Dulquer Salman) సొంత భాష అయిన మలయాళంలో కంటే టాలీవుడ్ లోనే ఎక్కువగా దూసుకెళ్తున్నాడు. మహానటి(Mahanati) సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దుల్కర్ ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తర్వాత సీతారామం(Sitaramam) సినిమాతో సోలో హిట్ అందుకుని రీసెంట్ గా లక్కీ భాస్కర్ తో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
లక్కీ భాస్కర్(Lucky Baskhar) తర్వాత దుల్కర్ ఏ సినిమా చేస్తాడనుకుంటుండగా తను కాంతా(Kantha) అనే ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. పీరియాడికల్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సెల్వమణి సెల్వరాజ్(Selvamani Selvaraj) డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా కథ 1950 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం.
థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) హీరోయిన్ గా నటిస్తోంది. అయితే లక్కీ భాస్కర్ చూశాక దుల్కర్ స్టోరీ సెలక్షన్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడనేది అర్థమవుతుంది. దీంతో దుల్కర్ ఒక సినిమా ఓకే చేశాడంటే అది ఎంతో స్పెషల్ గా ఉంటుందని ఆడియన్స్ ఫీలవుతున్నారు. కాంతా సినిమా కూడా దుల్కర్ గత సినిమాల్లానే సూపర్ హిట్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.













